Narendra Modi: ధుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటూ బీజేపీ అగ్రనాయకత్వంపై యశ్వంత్ సిన్హా ఫైర్

  • దేశంలోని ప్రమాదకరమైన 'తుక్డే తుక్డే' గ్యాంగ్ లో ఇద్దరున్నారు
  • ఆ ఇద్దరూ బీజేపీలో ఉన్నారు
  • అమిత్ షా వ్యాఖ్యలకు యశ్వంత్ సిన్హా కౌంటర్
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కేంద్ర మాజీ మంత్రి, మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన 'తుక్డే తుక్డే' గ్యాంగ్ లో ఇద్దరు ఉన్నారని అన్నారు. ధుర్యోధనుడు, దుశ్వాసనుడు అయిన ఆ ఇద్దరూ బీజేపీలో ఉన్నారని చెప్పారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత వారం ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని 'తుక్డే తుక్డే' గ్యాంగ్ కు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో నెలకొన్న ఆందోళనలకు వారే కారణమని మండిపడ్డారు. సాధారణంగా విపక్షాలను, వారికి మద్దతిస్తున్న వారిని ఉద్దేశిస్తూ 'తుక్డే తుక్డే' అనే పదాన్ని వాడుతుంటారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే యశ్వంత్ సిన్హా బీజేపీ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
Narendra Modi
Amit Shah
Yashwanth Sinha
BJP

More Telugu News