amaravathi: చేతకాకే రాజధానిపై రూ.లక్ష కోట్ల జపం చేస్తున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శ

  • సంపద సృష్టి ఎలాగో జగన్‌ తెలుసుకోవాలి
  • సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సంస్థగా అభివృద్ధి చేయొచ్చు
  • విపక్షంలో ఒక మాట...అధికారంలోకి వచ్చాక మరోమాట
అభివృద్ధి, సంపద సృష్టి వంటి అంశాలపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి అవగాహన లేదని, చేతకాకపోవడం వల్లే అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆ పార్టీ నాయకులు జపం చేస్తున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతిని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాస్టర్‌ ప్లాన్‌లోనే ఉందని ఆయన గుర్తు చేశారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ (స్వీయ ఆర్థిక సృష్టి) పథకంగా అమరావతిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా, కావాలనే వైసీపీ ప్రభుత్వం కొత్త రాజధాని వెంట పడుతోందన్నారు. అప్పట్లో చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, విపక్ష నాయకుడిగా జగన్‌ అప్పుడు అంగీకరించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు.
amaravathi
jagan
kanakamedala

More Telugu News