Ntr: సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఎన్టీఆర్?

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నిర్మాతగా మారే ఆలోచన చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ బయటి నిర్మాతల  సినిమాలతో పాటు, సొంత ప్రొడక్షన్ వంటి కల్యాణ్ రామ్ బ్యానర్లో సినిమాలు చేస్తూ వచ్చాడు.

అయితే తనకి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉండేలా చూసుకోవాలనే ఆలోచన ఆయన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తన తండ్రి .. తన తనయుడు పేర్లు కలిసి వచ్చేలా, 'భార్గవ్ హరి ప్రొడక్షన్స్' పేరుతో ఒక బ్యానర్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ .. చరణ్ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ సలహా మేరకే ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
Go Back to Shorts
Ntr
Charan
Bhargav

More Telugu News