Chandrababu: చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉంది: విజయసాయిరెడ్డి

  • అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పండి
  • సీబీఐ దర్యాప్తు జరపాలని కోరండి
  • ఏమీ చేయకపోతే ఎందుకంత భయం
నిన్న ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

'మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములను కొనుగోలు చేశామని చెప్పండి' అని ట్వీట్ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి, తమపై పడిన నిందను తొలగించమని సీబీఐని కోరండని అన్నారు. మీరు ఏమీ చేయకపోతే ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు.
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News