Nagarjuna: నాగార్జున కొత్త చిత్రం టైటిల్... 'వైల్డ్ డాగ్'!

  • కొత్త దర్శకుడికి చాన్సిచ్చిన నాగ్
  • సాల్మన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్'
  • వచ్చే ఏడాది రిలీజ్ కానున్న చిత్రం
టాలీవుడ్ హీరో నాగార్జున కొత్త ప్రాజెక్టుకు 'వైల్డ్ డాగ్' అనే టైటిల్ ఖరారైంది. ఇటీవలే మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్ ఆ సినిమాతో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో, కొత్త దర్శకుడికి ఆయన అవకాశం ఇవ్వడం విశేషం అనే చెప్పాలి. సాల్మన్ దర్శకత్వంలో నాగ్ ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' చిత్రం చేస్తున్నాడు.

తాజాగా దీని మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇది యాక్షన్ ప్రధాన చిత్రమని నాగ్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. 'వైల్డ్ డాగ్' చిత్రంలో నాగ్ పాత్ర పేరు విజయ్ వర్మ. ఇది ఓ ఎన్ఐఏ అధికారి కథ. కావాల్సినంత యాక్షన్ మసాలా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nagarjuna
Wild Dog
Soloman
Tollywood

More Telugu News