cm: జగన్ ని పిచ్చి తుగ్లక్ కంటే ఇరవై రెట్లు పెద్ద పిచ్చోడనే పరిస్థితి వచ్చింది: చంద్రబాబునాయుడు
- మూడు రాజధానులా? తలకాయ ఉన్నోళ్లు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా?
- జగన్ కు ఒక్కడికే ఇలాంటి పిచ్చి ఆలోచన వచ్చింది
- పిచ్చి ముదిరితే ఇట్లానే ఉంటుంది
'మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని తలకాయ ఉన్నవాళ్లు ఎవరైనా ఆలోచిస్తారా? ఇదో పిచ్చి ఆలోచన' అంటూ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలు, రాజధానిని మార్చే అధికారం మీకు ఎక్కడ ఉంది? ‘హూ ఆర్ యూ?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ని పిచ్చి తుగ్లక్ కంటే ఇరవై రెట్లు పెద్ద పిచ్చోడని అనే పరిస్థితి వచ్చిందని, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పని చేసి వెళ్లారని, జగన్ కు ఒక్కడికే ఇలాంటి పిచ్చి ఆలోచన వచ్చిందని, పిచ్చి ముదిరితే ఇట్లానే ఉంటుందంటూ జగన్ పై ధ్వజమెత్తారు.