Vijayasai Reddy: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం.. ప్రభుత్వానికి సంబంధం లేదు: మంత్రి పేర్ని నాని

  • విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఇక్కడకు జగన్ తొలిసారి వస్తున్నారన్న విజయసాయి
  • రాజధానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న పేర్ని నాని
  •  విశాఖ వైసీపీ ఇన్చార్జిగా ఆయన మాట్లాడి ఉండవచ్చు 
విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి తర్వాత ముఖ్యమంత్రి జగన్ తొలిసారి ఇక్కడకు రాబోతున్నారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నానిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... రాజధానిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని... త్వరలో ఏర్పాటు చేయబోయే హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. విశాఖ వైసీపీ ఇన్చార్జిగా ఆయన మాట్లాడి ఉండవచ్చని అన్నారు.
Vijayasai Reddy
Perni Nani
YSRCP

More Telugu News