Vikram: విక్రమ్ ఆశలన్నీ ఆ సినిమా పైనేనట

  • విభిన్నమైన కథలకి ప్రాధాన్యత 
  •  విలక్షణ పాత్రలవైపు మొగ్గు 
  • తాజా చిత్రంగా సెట్స్ పై 'కోబ్రా'  
తమిళ సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ ఒకరుగా కనిపిస్తారు. మొదటి నుంచి కూడా ఆయన విభిన్నమైన కథలకు ..  విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. ఆయన తాజా చిత్రంగా 'కోబ్రా' రూపొందుతోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, రీసెంట్ గా టైటిల్ ను ఖరారు చేసి పోస్టర్ వదిలారు.

టైటిల్ .. దానిని డిజైన్ చేసిన తీరుకి మంచి మార్కులు పడ్డాయి. లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాపై విక్రమ్ అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఈ సినిమాలోనూ ఆయన కొత్తగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విక్రమ్ కి చెప్పుకోదగిన హిట్ పడలేదు. సీనియర్స్ స్టార్ హీరోల రేసులో ఆయన చాలా వెనుకబడిపోయాడు. అయితే ఈ సినిమాతో తనకి తప్పకుండా భారీ హిట్ పడుతుందనే ఆశాభావంతో విక్రమ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Vikram

More Telugu News