Jagan: రాజధాని తరలింపుపై తొందరేమీ లేదు.. చెప్పి చేద్దాం!: ఏపీ సీఎం జగన్

  • ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేం
  • అమరావతికి చేసే ఖర్చులో 10 శాతం ఖర్చు చేసినా హైదరాబాదులా విశాఖ మారుతుంది
  •  రాజధాని మార్పు ఎందుకనేది చెప్పి చేద్దాం
ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అంశంపై లోతుగా చర్చ జరిగింది. ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు వివరించినట్టు తెలుస్తోంది. అమరాతికి ఖర్చు పెట్టే లక్ష కోట్లలో 10 శాతాన్ని ఖర్చు చేసినా హైదరాబాదులా విశాఖ మారుతుందని చెప్పారు. రాజధాని మార్పుపై ప్రజలకు స్పష్టంగా వివరిద్దామని చెప్పారు. రాజధానిపై వచ్చే నెల 4వ తేదీన ప్రకటన చేద్దామని కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు సూచించారు. హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రకటిద్దామని మరికొందరు మంత్రులు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ, రాజధాని తరలింపుపై తొందరేమీ లేదని అన్నారు. రాజధాని మార్పు ఎందుకనేది ప్రజలకు చెప్పి చేద్దామని తెలిపారు.
Jagan
Amaravathi
YSRCP

More Telugu News