Bheemeshwara Rao: ఆ దర్శకుడు మాత్రమే డబ్బులు ఇంటికి పంపించాడు: సీనియర్ నటుడు భీమేశ్వరరావు
- తొలినాళ్లలో అవకాశాలు అడిగాను
- ఆయనని ఎప్పుడూ పారితోషికం అడగలేదు
- అలాంటి దర్శకుడిని చూడలేదన్న భీమేశ్వరరావు
కేరక్టర్ ఆర్టిస్ట్ గా భీమేశ్వరరావుకి మంచి పేరు వుంది. సీనియర్ హీరోలతో కలిసి ఆయన అనేక చిత్రాలలో నటించారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఆయన చేసిన పాత్రలు కొన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి భీమేశ్వరరావు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నటుడిగా తన అనుభవాలను గురించి ప్రస్తావించారు.
"తొలినాళ్లలో మంచి పాత్రలు వుంటే ఇవ్వమని చెప్పి దర్శక నిర్మాతలను అడిగేవాడిని. నేను ఏ తరహా పాత్రలకి పనికొస్తానో తెలిసిన తరువాత వాళ్లే ఇవ్వడం మొదలుపెట్టారు. విఠలాచార్య దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేశాను. ఆయన దర్శకత్వంలో ఏ సినిమా చేసినా, ఎప్పుడూ పారితోషికం అడిగింది లేదు. సినిమాకి మూడు దఫాలుగా ఆయన పారితోషికాన్ని ఇంటికి పంపించేవారు. అలా ఇంటికి పారితోషికాన్ని పంపించిన దర్శకుడిని ఆయననే చూశాను" అంటూ చెప్పుకొచ్చారు.