Police: తాడేపల్లికి బయలుదేరిన జగన్... సీఎం వెళ్లే ముందు ఖాళీ కాన్వాయ్ ను పంపిన పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కొనసాగిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో కేబినెట్ సమావేశానికి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ ను 'రాజధాని' ఆందోళనకారులు అడ్డుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వెళ్లే సమయంలోనూ ఇదే రీతిలో చర్యలు తీసుకున్నారు.

జగన్ వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం వెళ్లే ముందు పోలీసులు ఖాళీ కాన్వాయ్ ను పంపారు. కాసేపట్లో జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. కాగా, రేపు ఉదయం ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళ్లనున్నారు.
Go Back to Shorts
Police
Jagan
Andhra Pradesh

More Telugu News