Chandrababu: చంద్రబాబు పాలనలో అవినీతిపై జగన్ కు మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక

  • జగన్ తో మంత్రి వర్గ ఉప సంఘం భేటీ
  • సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక?
  • టీడీపీ పాలనలో అవినీతి జరిగిందని మొదటి నుంచి వైసీపీ ఆరోపణలు  
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో అవినీతిపై మంత్రి వర్గ ఉప సంఘం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నివేదిక ఇచ్చింది. ఈ రోజు ఉదయం జగన్ తో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. గత ప్రభుత్వ  పాలనలో జరిగిన అవినీతిపై ఏసీబీతో పాటు నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉప సంఘం నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది.

టీడీపీ పాలనలో రాష్ట్రంలో చోటు చేసుకున్న సాగునీటి ప్రాజెక్టుల, రాజధాని పనుల్లో జరిగిన అవినీతితో పాటు పలు అంశాలపై జగన్ కి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. 
Chandrababu
Jagan
Telugudesam

More Telugu News