Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స ఇంటి ముట్టడి

  • టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆందోళన
  • రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముట్టడి
  • బొత్స రాజీనామా చేయాలని డిమాండ్
  • సూర్యారావు పోలీస్ స్టేషన్ కు తరలింపు
ఏపీలో రాజధాని వివాదం నేపథ్యంలో ఈ రోజు ఉదయం విజయవాడలోని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముట్టడించారు.

టీఎన్ఎస్ఎఫ్ ఏపీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో బొత్స ఇంటి ముట్టడిలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. బొత్స మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సూర్యారావు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
YSRCP

More Telugu News