Nara Lokesh: ప్రతి ఇంటి దగ్గర ఐదుగురు పోలీసులా?: వైసీపీపై నారా లోకేశ్ విమర్శలు

  • యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారు?
  • వైకాపా మేధావులు సమాధానం చెప్పాలి
  • అడుగుకో పోలీస్ ని పెట్టారు 
రాజధాని విషయంపై చెలరేగుతోన్న గందరగోళాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తీసుకున్న నిర్ణయం మంచిదైతే యుద్ధ వాతావరణం ఎందుకు తీసుకొచ్చారో వైకాపా మేధావులు సమాధానం చెప్పాలంటూ ఆయన ట్వీట్ చేశారు.

రాజధానిగా అమరావతి ఉంటుందని, అద్భుతమైన నగరాన్ని కడతామని ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని శాంతియుతంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఆందోళన చేస్తున్నారని లోకేశ్ తెలిపారు.
 
అయితే, అడుగుకో పోలీస్ ని పెట్టారని నారా లోకేశ్ విమర్శించారు. 'ప్రతి ఇంటి దగ్గరా ఐదుగురు పోలీసులా? ముళ్ల కంచెలు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, లాఠీలు, తుపాకులా? ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసి పోయారు' అని విమర్శలు గుప్పించారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News