Bollywood: ఎవరినీ కించపరిచేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు: రవీనా టాండన్

  • రవీనా టండన్, ఫరా ఖాన్ లపై కేసు నమోదు
  • క్రిస్టియన్లను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ కేసు
  • ఒరిజినల్ క్లిప్ ను షేర్ చేసిన రవీనా
ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఎవరినీ కించపరిచేలా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. టెలివిజన్ షోలో తాను మాట్లాడిన ఒరిజినల్ క్లిప్ ను షేర్ చేస్తున్నానని... అందరూ దీన్ని చూడాలని ట్విట్టర్ లో క్లిప్ కు సంబంధించిన లింక్ ను షేర్ చేశారు. తాను ఎవరిపైనా కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని... ఒకవేళ ఎవరైనా అలా భావిస్తే, వారికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

ఓ టీవీ షోలో క్రిస్టియన్ సామాజికవర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానించారంటూ రవీనా టాండన్, కమెడిన్ భారతి సింగ్, దర్శకనిర్మాత ఫరా ఖాన్ లపై పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.  
Bollywood
Raveena Tandon

More Telugu News