Kesineni Nani: ప్రపంచంలో మరెక్కడా ఇంత వింత చూడలేదు: కేశినేని నాని

  • పరిపాలనా రాజధాని విశాఖలో
  • స్వాగతించిన రెండు జిల్లాల ఎమ్మెల్యేలు
  • సెటైర్లు వేసిన విజయవాడ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని విశాఖపట్నం తరలిస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ప్రపంచంలో ఇటువంటి వింతను ఎక్కడా చూడలేదన్నారు.

"ప్రపంచంలో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదు ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కొరే/పోరాడే ప్రజాప్రతినిధులను చూసాము . మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీలో వుండటం మన కర్మ" అని అన్నారు. 
Kesineni Nani
Twitter
YSRCP
Vizag

More Telugu News