Smart Phone: స్మార్ట్ ఫోన్ లాక్కుని పరిగెడుతుంటే... వెంబడించి పట్టుకున్న బాధితుడు!

షార్ట్స్‌లో చూడండి
తన చేతిలోని స్మార్ట్ ఫోనును లాక్కుని పారిపోతున్న ఓ దొంగను, అతని వెనుకే పరిగెట్టి పట్టుకున్నాడో యువకుడు. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలును ఉప్పుగూడ స్టేషన్ లో సాయితేజ అనే యువకుడు ఎక్కాడు.

రైలు మలక్ పేట స్టేషన్ వద్దకు వచ్చిన సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఉండగా, ఓ దొంగ వచ్చి, ఫోన్ లాక్కుని, నడుస్తున్న రైలు నుంచి దూకి పరుగు లంఘించాడు. తన ఫోన్ కోసం రైలు దూకిన సాయితేజ, అన్ని వెంటాడి పట్టేసుకున్నాడు. ఆపై మిగతా ప్రయాణికులతో కలిసి దేహశుద్ధి చేసి, రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఉప్పుగూడకు చెందిన రియాజ్ (22)గా గుర్తించామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
Smart Phone
Thief
Hyderabad
Police

More Telugu News