Jagan: తోక మీద వెంట్రుకను మాకు ఇస్తున్నారు: బైరెడ్డి      

  • జగన్ దృష్టిలో విశాఖే రాష్ట్ర రాజధాని
  • ఎన్నికలకు ముందే విజయసాయిరెడ్డి వైజాగ్ లో తిష్ట వేశారు
  • తెలుగును కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో విశాఖే రాష్ట్ర రాజధాని అని చెప్పారు. న్యాయ రాజధాని అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. తలను వైజాగ్ కు ఇచ్చి... తోకమీద వెంట్రుకను కర్నూలుకు ఇచ్చారని విమర్శించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ఇప్పుడు లేఖలు రాసిన వారికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఆనాడే తనతో కలిసి పోరాడి ఉంటే రాష్ట్రం విడిపోయేదే కాదని చెప్పారు. కోస్తాంధ్ర ప్రాంత ఓట్ల కోసమే గతంలో అమరావతికి జగన్ ఆమోదం తెలిపారని అన్నారు. ఎన్నికలకు ముందే వైజాగ్ లో విజయసాయిరెడ్డి తిష్ట వేశారని చెప్పారు. చివరకు మాతృభాష తెలుగును కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Jagan
Vijayasai Reddy
YSRCP
Byreddy
BJP

More Telugu News