Amaravathi: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప సీఎం జగన్ పాలనలో ఏం చేశారు?: నారా లోకేశ్

  • అమరావతిని తరలించాలన్న ఆలోచన కరెక్టు కాదు
  • ప్రభుత్వాలు, సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారితే ఎలా?
  • ఈ సంప్రదాయం చాలా ప్రమాదం
సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప జగన్ ఏడు నెలల పాలనలో ఏ ప్రాంతాన్ని అయినా అభివృద్ధి చేసేందుకు ఒక్క మంచి నిర్ణయం అయినా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మార్చడం సంప్రదాయంగా మారితే ఎంత ప్రమాదమో ప్రజలంతా ఆలోచించాలని సూచిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
Amaravathi
Telugudesam
Nara Lokesh
Jagan

More Telugu News