YSRCP: అమరావతి నిర్మాణం పూర్తవ్వాలంటే 100 ఏళ్లు పడుతుంది: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి

  • సింగపూర్ కంపెనీలు వస్తున్నాయంటూ మభ్యపెట్టారు
  • ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతంగా భూములు లాక్కున్నారు
  • అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగింది
అమరావతి రాజధాని అంశంపై వస్తోన్న విమర్శలకు  రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'సింగపూర్ కంపెనీలు వస్తున్నాయంటూ మభ్యపెట్టి భూములు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు. అమరావతిలో భారీ భూ కుంభకోణం జరిగింది. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన రాజధానికి గత ఐదేళ్లలో కేంద్రం, రాష్ట్రం కలిసి ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే. అమరావతి నిర్మాణం పూర్తవ్వాలంటే వందేళ్లు పడుతుంది' అని వ్యాఖ్యానించారు.

'అమరావతి రైతులను చూసి భావోద్వేగానికి గురయ్యానని వెంకయ్య నాయుడు అంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వలసలు వెళ్తోన్న కూలీలను చూసి భావోగ్వేగం కలగలేదా? ఒంగోలు ఫ్లోరైడ్ బాధితుల గురించి వెంకయ్య ఎందుకు స్పందించలేదు? వెంకయ్య నాయుడు కేంద్రం నుంచి ప్యాకేజీని ఎందుకు ఇప్పించలేకపోయారు?' అని తోపుదుర్తి ప్రశ్నించారు.
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News