Vizag: టీడీపీకి మరో షాక్.. విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా

  • రాజధానిపై టీడీపీ వైఖరికి నిరసనగా రాజీనామా
  • లోకేశ్ రాకతో పార్టీ మొత్తం దెబ్బతిన్నదని వ్యాఖ్య
  • ఐదేళ్ల పాలనలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయారంటూ విమర్శ
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా చేశారు. ఎన్నార్సీతో పాటు రాజధానిపై టీడీపీ వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేత నారా లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. లోకేశ్ రాకతో పార్టీ మొత్తం దెబ్బతిన్నదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు లోకేశ్ తీరుతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయారని చెప్పారు. రాజధానిగా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
Vizag
Telugudesam
Rehaman
Nara Lokesh

More Telugu News