Sujana Chowdary: వారిని చంద్రబాబే పంపించాడని బీజేపీ వాళ్లకు అర్థమైంది: విజయసాయి రెడ్డి
- సుజనా చౌదరి.. చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ వాళ్లకు ముందే తెలుసు
- ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది బయట పడుతుంది
- వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సుజనా చౌదరిని చంద్రబాబు కోవర్ట్ అని అన్నారు. 'సుజనా చౌదరి.. చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ వాళ్లకు ముందే తెలుసు. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని చంద్రబాబు నాయుడు పంపించాడని వాళ్లకు అర్థమైంది' అని ట్వీట్ చేశారు.
'ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాడు? ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది త్వరలోనే బయట పడుతుంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
'ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాడు? ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది త్వరలోనే బయట పడుతుంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.