Andhra Pradesh: ఆరు నెలల్లోనే ఏపీ ప్రభుత్వానికి ఇన్ని అక్షింతలు అవసరమా?: సోమిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఆరు నెలల్లోనే ప్రభుత్వానికి ఇన్ని అక్షింతలు అవసరమా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మొదట పీపీఏలు, పోలవరం విషయంలో హైకోర్టు మందలించిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు, అగ్రి వర్సిటీ వీసీ, ఏపీపీఎస్సీ చైర్మన్ల విషయాల్లోనూ హైకోర్టు మందలింపులు చేసిందని ఆయన విమర్శించారు.

మరోవైపు టీవీ చానళ్లను నిషేధించడంతో ట్రాయ్ అక్షింతలు వేసిందని, కృష్ణకిషోర్ మీద కక్ష సాధించి క్యాట్ తో చివాట్లు తిన్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం ఇంత మందితో చెప్పించుకుందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ లో ఆ ప్రభువే మార్పు తేవాలని సోమిరెడ్డి అన్నారు. 
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
somireddy

More Telugu News