Chandrababu: ఏలూరు మాజీ ఎమ్మెల్యే బుజ్జి మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం

  • బుజ్జి మృతి పార్టీకి తీరని లోటు
  • ఏలూరు అభివృద్ధికి విశేష కృషి
  • ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా ఏలూరు అభివృద్ధికి బుజ్జి విశేష కృషి చేశారన్నారు. ఏలూరును స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేశారన్నారు. ఆయన మృతి ఏలూరు నియోజకవర్గానికే కాకుండా, తెలుగుదేశం పార్టీకి కూడా తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బుజ్జి మృతికి టీడీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల శ్రేయస్సు గురించే ఆయన ఆలోచించారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు.
Chandrababu
Nara Lokesh
Badeti bujji

More Telugu News