వ్యక్తిగత స్వార్థం వదలి దేశం కోసం నవ్వుతూ పనిచేయాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- ధర్మ విజయం ఉత్కృష్టమైనది
- సంఘ్ కార్యకర్తలు ఎల్లప్పుడూ దేశ విజయాన్ని కోరుకుంటారు
- రజస్సు, తమస్సు శక్తులపై సాత్విక శక్తులు విజయం సాధించాల్సి ఉంది
రజస్సు, తమస్సు శక్తులపై సాత్విక శక్తుల విజయం సాధించాల్సి ఉందన్నారు. వ్యక్తి, మానవ సమాజం, సృష్టి కలుపుకొని అందరి సంతోషంకోసం కృషిచేసేదే అసలైన ధర్మమని అన్నారు. ఈ ధర్మంతో సర్వత్రా శాంతి ఏర్పడుతుందన్నారు. ఇది భగవంతుని వైపు నడిపిస్తుందని చెప్పారు. ఇదే భగవద్గీతలో చెప్పబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు రాంమాధవ్, లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి తదితరలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ బివిఆర్ మోహన్ రెడ్డి హాజరయ్యారు.