Amaravathi: ప్రాంతాల మధ్య ప్రభుత్వం చిచ్చుపెడుతోంది: బీజేపీ నేత మాణిక్యాలరావు

  • రాజధాని అంశంలో ప్రభుత్వానికి స్పష్టత లేదు
  • అమరావతిని తరలించాలన్నది అభివృద్ధి నిరోధక చర్య
  • రైతులకు అండగా ఉంటాం
ఏపీ రాజధాని అమరావతి తరలింపు ప్రతిపాదనతో ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శించారు. రాజధాని అంశంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, అమరావతిని తరలించాలన్నది అభివృద్ధి నిరోధక చర్యగా అభివర్ణించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాజధాని వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే ఏపీ అభివృద్ధి చెందుతుందని తమ పార్టీ భావిస్తోందని, రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
Amaravathi
BJP
Manikyalarao
Andhra Pradesh

More Telugu News