cm: సీఎం జగన్ ది ఉక్కు సంకల్పం: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

  • మన కలలను నెరవేరుస్తున్న నాయకుడు
  • రాయచోటి అభివృద్ధికి రూ.340 కోట్లు కేటాయించారు
  • ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తా
సీఎం జగన్ ది ఉక్కు సంకల్పం అని, మన కలలను నెరవేరుస్తున్న నాయకుడు సీఎం జగన్ అని రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయచోటి పట్టణాభివృద్ధికి రూ.340 కోట్లు కేటాయించారని, రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. జగన్ లాంటి నాయకుడితో కలిసి పనిచేయడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తామని మరోమారు ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.
cm
jagan
mla
Srikanthreddy
Rayachoti

More Telugu News