Buddhavenkanna: జగన్ గారిని జైలుకి పంపి,16 నెలలు ఊచలు లెక్కపెట్టించావు: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు

  • 40 వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు
  • మరోసారి జగన్ ని జీవిత కాలం జైలుకి పంపాలని స్కెచ్ 
  • అమరావతిపై మీరు చేసిన ఒక్క ఆరోపణా నిరూపించలేకపోయారు 
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. సూట్ కేసు కంపెనీల సలహాలతో వైఎస్ జగన్ ను జైలుకి పంపి,16 నెలలు దగ్గరుండి ఊచలు లెక్కపెట్టించారని అన్నారు. ఇప్పుడు విశాఖ, విజయనగరం జిల్లాల్లో 40 వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కి పాల్పడి మరోసారి జగన్ గారిని జీవిత కాలం జైలుకి పంపాలని స్కెచ్ వేసినట్టు కనిపిస్తుందని విజయసాయి రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.

'అమరావతిపై మీరు చేసిన ఒక్క ఆరోపణా నిరూపించలేక, ప్రభుత్వం రైతుల దగ్గర నుండి సమీకరించిన భూములు కొట్టేసే మార్గం లేక రాజధానిని విశాఖకి మార్చారు. ఈ రహస్యం, దాని వెనుక స్కామ్ త్వరలోనే బయటకు రాబోతుంది' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.

Buddhavenkanna
YSRCP
Telugudesam

More Telugu News