Vijay Sai Reddy: చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశాడు.. ప్లాన్లన్నీ బెడిసికొట్టాయి: విజయసాయిరెడ్డి

  • రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో స్కెచ్
  • తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలనుకున్నారు
  • వాటి విలువ 6-7 లక్షల కోట్ల రూపాయలకు చేరేది
  • వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు రావచ్చంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడి తీరుపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు.

రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన బంధువులు, బినామీల భూముల ధరలు పెంచాలని చంద్రబాబు నాయుడు స్కెచ్ వేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అలా జరిగి ఉంటే  వాటి విలువ 6-7 లక్షల కోట్ల రూపాయలకు చేరేదని ఆరోపించారు. వికేంద్రీకరణతో ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని సామూహిక శోకాలు పెడుతున్నారని విమర్శించారు.


Vijay Sai Reddy
Andhra Pradesh
Chandrababu

More Telugu News