Raviteja: 'డిస్కోరాజా' ప్రత్యేక ఆకర్షణలు ఇవేనట

  • వీఐ ఆనంద్ నుంచి 'డిస్కోరాజా'
  • రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు
  • ప్రతినాయకుడిగా బాబీసింహా 
రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' సినిమా రూపొందింది. అవుట్ పుట్ విషయంలో మరింత శ్రద్ధపెట్టి, కొన్ని సన్నివేశాలను రీ షూట్ కూడా చేశారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే బలమైన కథాకథనాలు .. రవితేజ ద్విపాత్రాభినయం .. నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ వంటి ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ .. తమన్ సంగీతం .. తమిళ స్టార్ హీరో బాబీసింహా విలక్షణమైన విలనిజం .. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా చెబుతున్నారు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ, ఇది తప్పకుండా తనకి బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెడుతుందని రవితేజ భావిస్తున్నాడు. ఆయన అభిమానులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Raviteja
Nabha Natesh
Payal
Thanya

More Telugu News