Chandrababu: తుళ్లూరు రైతులకు విజయసాయిరెడ్డి సూచన!

  • చంద్రబాబును నమ్మకండి
  • రైతులను ఆయన ఇప్పటికే ఒకసారి ఫణంగా పెట్టారు
  • చంద్రబాబును దూరం పెడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి
ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చేమోనంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అమరావతి ప్రాంత రైతులకు షాకిచ్చాయి. రాజధాని కోసం భూములను ఇచ్చిన తమ భవిష్యత్తు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.

తుళ్లూరు రైతులు చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. తన బంధువర్గాల రియలెస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని అన్నారు. ఇప్పుడు మళ్లీ వారినే అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని... చంద్రబాబును దూరం పెడితే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు.
Chandrababu
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News