Kesineni Nani: జగనన్నా... నువ్వు సూపరన్నా: కేశినేని నాని

  • ఎన్నార్సీకి వ్యతిరేకమన్న వైఎస్ జగన్
  • ముస్లింల ఓట్ల కోసమే వ్యతిరేకం
  • ఏదైనా జగన్ కే చెల్లుతుందన్న నాని
ఎన్నార్సీకి తమ పార్టీ వ్యతిరేకమని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై విజయవాడ ఎంపీ కేశినేని నాని, తన ట్విట్టర్ ఖాతా ద్వారా సెటైర్లు వేశారు. "జగనన్నా నువ్వు సూపర్ అన్న. కేసుల మాఫీ కోసం నీ ఎంపీలతో సీఏబీకి అనుకూలంగా ఓటేపిస్తావు. ముస్లింల ఓట్ల కోసం ఎన్ఆర్సీకి వ్యతిరేకమంటావు. ఏదయినా నీకే చెల్లిందన్న. హ్యాట్సాఫ్ అన్నా" అని వ్యాఖ్యానించారు. తన ట్వీట్ కు జగన్ అన్న మాటల పత్రిక క్లిప్పింగ్ ను కేశినేని నాని జతపరిచారు. నాని ట్విట్టర్ సెటైర్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
Kesineni Nani
Jagan
Twitter

More Telugu News