cm: దేవినేని ఉమ వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

  • మూడు రాజధానులపై సీఎం ప్రకటించే వరకు తెలియదు
  • ఎన్నికల తర్వాత గజం భూమి కూడా కొనలేదు
  • నా కంపెనీలో విజయసాయిరెడ్డి పెట్టుబడులు లేవు
దేవినేని ఉమా చేసిన ఆరోపణలను వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఖండించారు. కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటించే వరకు తనకు తెలియదని చెప్పారు. ఎన్నికల తర్వాత గజం భూమి కూడా తాను కొనుగోలు చేయలేదని, ఒకవేళ చేసినట్టు నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన పేరిట, తన భార్య పేరిట మాత్రమే వ్యాపారాలు ఉన్నాయని, తమ కంపెనీల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టుబడులు పెట్టారన్న వదంతులు సరికాదని అన్నారు.
cm
Jagan
Telugudesam
Devineni Uma
Mp
Mvv Satyanarayana
YSRCP
Visakhapatnam

More Telugu News