YSRCP: వైసీపీలో ఉండి కూడా రాజధాని వెళ్లిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నాం: మల్లెల హరీంద్రనాథ్

  • ప్రభుత్వ నిర్ణయంపై భిన్నస్వరం
  • రైతులకు మద్దతుగా మాట్లాడిన వైసీపీ నేత హరీంద్రనాథ్
  • పార్టీలకు అతీతంగా రైతులకు సంఘీభావం ప్రకటిస్తానని వెల్లడి
ఏపీ రాజధాని అమరావతి మార్పు అంశం తీవ్ర విమర్శల పాలవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత మల్లెల హరీంద్రనాథ్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తాము వైసీపీలో ఉండి కూడా రాజధాని వెళ్లిపోతుంటే నిస్సహాయుల్లా చూస్తూ ఉండాల్సి వస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రాజధానులు ఏర్పాటు చేసుకున్నా, అమరావతిలో అభివృద్ధి పనులు ఆగడానికి మాత్రం వీల్లేదని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా అభివృద్థి కొనసాగాలని అన్నారు. గత కొన్నిరోజులుగా రైతులు ధర్నాలు చేస్తుంటే భరించలేకపోతున్నానని, పార్టీలతో సంబంధం లేకుండా మంగళవారం రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక్కడి రైతుల్లో అన్ని పార్టీల వారున్నారని పేర్కొన్నారు. అమరావతి విషయంపై సీఎం జగన్ తో చర్చిస్తానని తెలిపారు.
YSRCP
Harindranath
Andhra Pradesh
Amaravathi
Jagan

More Telugu News