YSRCP: వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది.. ప్రజలు హర్షించేలా లేదు: టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి

  • ఇలాంటి పిచ్చి పాలనతో చాలా నష్టపోయాం
  • భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి
  • ఆ బాధ్యత అందరిపైనా ఉంది
ఏపీలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు హర్షించేలా లేదని టీడీపీ అధికార ప్రతినిధి రేవతి చౌదరి విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి పిచ్చి పాలనతో చాలా నష్టపోయామని ఏపీ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని, ఆ బాధ్యత అందరిపైనా వుందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైజాగ్, తిరుపతి బాగా అభివృద్ధి చెందాయని చెప్పారు. ఇప్పుడు ఎవరికేమి అన్యాయం జరిగింది? అని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం తలెత్తకూడదని తాము కోరుకుంటున్నామని అన్నారు.
YSRCP
jagan
Telugudesam
Revathi chowdary

More Telugu News