Kesineni Nani: విశాఖకు అసలు ముప్పు జగన్ గ్యాంగ్ తోనే!: కేశినేని నాని

  • పాక్ నుంచి విశాఖ రక్షణకు సైన్యం
  • అసలు ముప్పు వైసీపీ నుంచే
  • ట్విట్టర్ లో కేశినేని నాని
"పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారత దేశ సైన్యం వుంది. కాని విశాఖకు అసలు ముప్పు ప్రస్తుతం మన జగన్నన అండ్ గ్యాంగ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే. వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి" అని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ఓ దినపత్రికలో "విశాఖపై పాకిస్థాన్ కన్నెందుకు?" అంటూ ప్రచురితమైన ఓ కథనాన్ని ఉంచారు. పాకిస్థాన్ నుంచి విశాఖకు ముప్పేమీ లేదని చెబుతూ, అసలు ముప్పు వైసీపీ నుంచేనని విమర్శించారు.
Kesineni Nani
Twitter
Vizag

More Telugu News