Rohit Sharma: అర్ధసెంచరీలు సాధించిన రోహిత్, రాహుల్... తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • కటక్ లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య మూడో వన్డే
  • భారత్ లక్ష్యం 316 పరుగులు
  • సెంచరీ మార్కు దాటిని టీమిండియా స్కోరు
కటక్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు శుభారంభం అందించారు. 316 పరుగుల భారీ లక్ష్యఛేదనలో జట్టు కోరుకునేవిధంగా నిలకడగా ఆడారు. రోహిత్ శర్మ (63), కేఎల్ రాహుల్ ఇద్దరూ విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని అర్థసెంచరీలు నమోదు చేశారు. తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం సాధించారు. 22 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 124 పరుగులు. రోహిత్ శర్మ 63 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ కు తోడుగా కెప్టెన్ కోహ్లీ ఉన్నాడు, అంతకుముందు టాస్ ఓడిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది.
Rohit Sharma
KL Rahul
Cuttack
ODI
WI
India

More Telugu News