Andhra Pradesh: అధికారం కోసం పార్టీలు మారే ఊసరవెల్లి అవంతి శ్రీనివాస్: విమర్శలు గుప్పించిన మంతెన

  • ఏపీ మంత్రి అవంతిపై మంతెన ఫైర్
  • మంత్రిగా అవంతి విఫలమయ్యారంటూ వ్యాఖ్యలు
  • విశాఖ భూకబ్జాల్లో అవంతిదే కీలకపాత్ర అంటూ ఆరోపణ
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారం కోసం పార్టీలు మారే ఊసరవెల్లి అవంతి శ్రీనివాస్ అని వ్యాఖ్యానించారు. విశాఖ భూకబ్జాల్లో అవంతిదే కీలకపాత్ర అని ఆరోపించారు. మంత్రిగా విఫలమైన అవంతి, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని విమర్శించారు. టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కనిపించిన అభివృద్ధి వైసీపీలోకి వెళ్లగానే మాయం అయిందా అంటూ అవంతిపై మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ మంతెన ఈ వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh
Avanthi
Manthena
Vizag
YSRCP

More Telugu News