Narendra Modi: మోదీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారు: డి.రాజా

  • ప్రధానిపై సీసీఐ అగ్రనేత విమర్శలు
  • అదానీ, అంబానీ సంస్థలకు భారీ రాయితీలు ఇస్తున్నారంటూ ఆరోపణ
  • నియంతలంటూ మోదీ, అమిత్ షాలపై మండిపాటు
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేశారు. మోదీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అదానీ, అంబానీ సంస్థలకు భారీగా రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, దేశంలో మహిళలపై దాడులు పెరిగాయని, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ వ్యవహరిస్తోందని రాజా విమర్శించారు. మోదీ, అమిత్ షా దేశాన్ని నియంతల్లా పరిపాలించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రజాస్వామ్యదేశంలో నిరంకుశత్వం కుదరని పని అని స్పష్టం చేశారు. సీపీఐ 95వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో నిర్వహిస్తున్న సందర్భంగా డి.రాజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi
Amit Shah
D.Raja
CPI
Guntur

More Telugu News