Jagan: భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే జగన్ భావిస్తున్నారు: హోం మంత్రి మేకతోటి సుచరిత

  • అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం ఆలోచన  
  • హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రిక్తహస్తాలతో వచ్చాం
  • సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు
  • ప్రాంతం గురించి కాదు రాష్ట్రం గురించి ఆలోచించాలి
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అమరావతిలో రైతులు పెద్ద ఎత్తున చేస్తోన్న ఆందోళనలపై ఆమె విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు రిక్తహస్తాలతో వచ్చామని తెలిపారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకూడదనే సీఎం భావిస్తున్నారని చెప్పారు. సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు.
 
ఒక ప్రాంతం గురించి కాకుండా రాష్ట్రం గురించి అందరూ ఆలోచించాలని సుచరిత హితవు పలికారు. సమగ్రంగా రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల్లో ఏర్పడిన అభద్రతాభావాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
Jagan
Andhra Pradesh
amaravati

More Telugu News