Kesineni Nani: 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి!: కేశినేని నాని

  • జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే ఇలా చేయండి 
  • కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున రాజధానులు పెట్టండి
  • ఈ ఐడియా బాగుంటుందేమో ఆలోచించండి
ఆంధ్రప్రదేశ్ లో 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శనాస్త్రాలు సంధించారు.

'జగన్ గారూ మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకి ఒక్కటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి' అంటూ ఎద్దేవా చేస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.
Kesineni Nani
Andhra Pradesh
Telugudesam

More Telugu News