Telangana: తెలంగాణలో విచిత్ర పరిస్థితి... 18 ఏళ్లు దాటినా ఓటు వేయలేకపోతున్న యూత్!

  • 2019 జనవరి 1 అర్హత తేదీ
  • ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగే అవకాశం
  • మరో నెలన్నరలో నోటిఫికేషన్!

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో 18 సంవత్సరాలు దాటినా ఓటు హక్కును వినియోగించుకోలేని వింత పరిస్థితి తలెత్తింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను ప్రకటించడమే ఇందుకు కారణం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోగా మునిసిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అంటే, 2019 జనవరి 1 తరువాత 18 సంవత్సరాలు నిండిన వారెవరూ ఓటు వేసే పరిస్థితి లేదు. జనవరి చివరి వారంలో, లేదా ఫిబ్రవరి తొలి వారంలో 121 మునిసిపాలిటీలు, 10 మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

వాస్తవానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది. ఆపై మార్చిలో ఎన్నికలు నిర్వహించాలి. ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి, మే వరకూ ఆగకుండా, ఫిబ్రవరిలోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ, ఈ సంవత్సరం జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ఓ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. 

More Telugu News