Andhra Pradesh: రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ కొనసాగింపు... రైతులపై కేసులు నమోదు

  • ఏపీకి మూడు రాజధానులంటూ ప్రచారం
  • రగిలిపోతున్న రాజధాని రైతులు
  • అమరావతిలో ఆందోళనలు
ఏపీకి మూడు రాజధానులు అంటూ జరుగుతున్న ప్రచారంతో అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. గత రెండ్రోజులుగా అమరావతిలో రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతుండడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతోపాటు 30 పోలీస్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు, ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు నమోదు చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేసిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేశారు.
Andhra Pradesh
Amaravathi
YSRCP
Jagan
Police

More Telugu News