Manchu Manoj: అభిమానితో మంచు మనోజ్ పరాచికాలు!

  • మనోజ్ ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఓ నెటిజన్
  • సీఎం జగన్ ను ఏమని పిలుస్తారో క్లారిటీ కోరిన సదరు వ్యక్తి
  • అదేరీతిలో బదులిచ్చిన మంచు మనోజ్
తనను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఓ నెటిజన్ తో టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఆసక్తికర సంభాషణ నడిపారు. సీఎం జగన్ ను మంచు కుటుంబ సభ్యులు తలో రకంగా సంబోధిస్తుండడం పట్ల చికాగో సుబ్బారావు అనే నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నువ్వేమో బావా అంటావ్, మీ అన్నయ్యేమో అన్నా అంటాడు... ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు బ్రో అంటూ మంచు మనోజ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి మనోజ్ ఫన్నీగా స్పందించాడు. సదరు నెటిజన్ పేరును దృష్టిలో ఉంచుకుని, నువ్వు చికాగో అంటావ్, మళ్లీ సుబ్బారావు అంటావ్... నువ్వు క్లారిటీ ఇవ్వు బ్రో అంటూ బదులిచ్చాడు.
Manchu Manoj
Tollywood
Twitter
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News