Andhra Pradesh: సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

  • నేడు సీఎం జగన్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలతో తడిసిముద్దవుతున్న జగన్
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ సూపర్ స్టార్
నేడు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు. జగన్ 47వ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ లో సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ గారికి వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు. మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. కాగా, మహేశ్ ట్వీట్ కు రీట్వీట్లు, లైకులు వేలల్లో ఉన్నాయి.
Andhra Pradesh
YSRCP
Jagan
Mahesh Babu
Tollywood
Birthday

More Telugu News