Nara Lokesh: జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు: నారా లోకేశ్

  • మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలి
  • ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి
  • ట్వీట్ చేసిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి పుట్టిన రోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు.

'ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.

కాగా, జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. విజయనగరం కురుపాంలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి రక్తదానం చేశారు. ప్రజా నాయకుడు జగన్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. జగన్ కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News