YSRCP: పంచాయతీ కార్యాలయానికి తమ పార్టీ రంగులు తుడిచేసి.. నలుపు రంగు వేస్తున్న వైసీపీ కార్యకర్తలు.. వెలగపూడిలో ఉద్రిక్తత

  • గ్రామ పంచాయతీ కార్యాలయంపైకి ఎక్కిన వైసీపీ కార్యకర్తలు
  • సొంత పార్టీ రంగులు తుడిచేస్తోన్న వైనం
  • అడ్డుకుంటోన్న పోలీసులు
అమరావతి రైతులు చేస్తోన్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. వెలగపూడిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి వైసీపీ నేతలు ఇటీవల తమ పార్టీ రంగులు వేసుకున్నారు. అయితే, ఇప్పుడు నిరసనల నేపథ్యంలో.. గ్రామ పంచాయతీ కార్యాలయంపైకి ఎక్కిన వైసీపీ కార్యకర్తలు తమ సొంత పార్టీ రంగులను తుడిచేస్తూ నలుపు రంగు వేస్తున్నారు. వారికి గ్రామస్థులు మద్దతు పలికారు.

అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులను నెట్టుకుని మరీ పంచాయతీ కార్యాలయానికి నల్లరంగు వేస్తున్నారు. భూములు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్యాయం చేయొద్దని రైతులు నినాదాలు చేస్తున్నారు.
YSRCP
Andhra Pradesh
amaravati

More Telugu News