Andhra Pradesh: సీఎం జగన్ కు అధ్యయన నివేదిక అందజేశాం: జీఎన్ రావు

  • రెండు అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించాం
  • ప్రాంతీయ సమతుల అభివృద్ధిపై నివేదిక ఇచ్చాం
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కమిటీ పర్యటించింది
ఏపీ రాజధానిపై నియమించిన జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎన్ రావు మాట్లాడుతూ, సీఎం జగన్ కు అధ్యయన నివేదిక అందజేశామని, రెండు అంశాల ఆధారంగా ఈ నివేదికను ఇచ్చినట్టు చెప్పారు. ప్రాంతీయ సమతుల అభివృద్ధిపై నివేదిక ఇచ్చామని, సహజవనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా అధ్యయనం చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కమిటీ పర్యటించిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా తిరిగి ఈ నివేదిక సమర్పించినట్టు చెప్పారు.
Andhra Pradesh
cm
Jagan
GN Rao

More Telugu News