Sarileru Neekevvaru: 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.

2020 ఏడాది ఆరంభంలో అతిపెద్ద సంరంభానికి మరింత వన్నె తీసుకువచ్చేలా చిరంజీవి గారు సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ట్వీట్ చేసింది. ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. కాగా, సంక్రాంతి కానుకగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Go Back to Shorts
Sarileru Neekevvaru
Mahesh Babu
Rashmika
Chiranjeevi
Megastar
Tollywood

More Telugu News