Disha: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

  • దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • హైకోర్టులో పిటిషన్
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం
దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపటి విచారణకు గాంధీ ఆసుపత్రి సూపరింటిండెంట్ హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలనుకుంటున్నామని హైకోర్టు పేర్కొంది. అయితే దిశ నిందితులు నలుగురికి ఇప్పటికే ఓసారి పోస్టుమార్టం నిర్వహించామని, రీపోస్టుమార్టం అవసరంలేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కాగా, నాలుగు మృతదేహాలను ఇటీవలే మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అక్కడి మార్చురీలో భద్రపరిచారు.
Disha
High Court
Telangana
Hyderabad
Police
Encounter

More Telugu News